‘కలియుగం పట్టణంలో’

ABN , Publish Date - Mar 20 , 2024 | 06:05 AM

విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. డిఫరెంట్‌ కాన్సె్‌ప్టతో రాబోతోన్న ఈ మూవీకి రమాకాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. డాక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి,...

‘కలియుగం పట్టణంలో’

విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. డిఫరెంట్‌ కాన్సె్‌ప్టతో రాబోతోన్న ఈ మూవీకి రమాకాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. డాక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమే్‌షలు నిర్మించిన ‘కలియుగం పట్టణంలో’ ఈ నెల 29న రాబోతోంది. సోమవారం ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమే్‌షలు మాట్లాడుతూ ‘‘కలియుగం పట్టణంలో సినిమా అంతా కూడా కడపలోనే తీశాం. దర్శకుడు రమాకాంత్‌ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాం. సినిమా అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది’’ అని అన్నారు. దర్శకుడు రమాకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ. ‘‘ఈ సినిమాలో యాక్షన్‌, లవ్‌, క్రైమ్‌..ఇలా అన్నీ ఉన్నాయి. ప్రేక్షకులు మా సినిమాను చూసి ఆదరించాలి’’ అని కోరారు. విశ్వ కార్తికేయ మాట్లాడుతూ ‘‘కలియుగం పట్టణంలో ప్రతీ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమా తప్పక ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. ఆయుషి పటేల్‌ మాట్లాడుతూ ‘‘టీం అంతా కలిసి సినిమా షూటింగ్‌ ఎంతో సరదాగా చేశాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌, కెమెరామెన్‌: చరణ్‌ మాధవనేని, సంగీతం: అజయ్‌ అరసాద, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రామ్‌ ప్రకాష్‌ రెడ్డి.

Updated Date - Mar 20 , 2024 | 06:05 AM