పదమూడో నంబర్‌ ఇంట్లో...

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:14 AM

‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ వంటి హారర్‌ థ్రిల్లర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్న దర్శకుడు పన్నా రాయల్‌ తాజా చిత్రం ‘ఇంటినంబర్‌ 13’. డిఫరెంట్‌ మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి ఒకటిన...

పదమూడో నంబర్‌ ఇంట్లో...

‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ వంటి హారర్‌ థ్రిల్లర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్న దర్శకుడు పన్నా రాయల్‌ తాజా చిత్రం ‘ఇంటినంబర్‌ 13’. డిఫరెంట్‌ మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి ఒకటిన విడుదల కానుంది. నవీన్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, నికిషా, ఆనందరాజ్‌, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని హేసన్‌ పాషా నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ ఇంతవరకూ వచ్చిన హారర్‌ సినిమాలకు ఇది పూర్తి విభిన్నం. సినిమాలో ప్రతి పది నిముషాలకూ ఓ ట్విస్ట్‌ ఉంటుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉండడంతో హాలీవుడ్‌ టెక్నీషియన్లతో వర్క్‌ చేయించాం. సినిమా బాగా వచ్చింది’ అన్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే సినిమా ఇదని నిర్మాత తెలిపారు.

Updated Date - Feb 20 , 2024 | 05:14 AM