39 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:25 AM

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ ప్రకటించినప్పటి నుంచే ఎన్నో ఆసక్తికర అంశాలతో భారతీయ ప్రేక్షకుల దృష్టిని...

39 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ ప్రకటించినప్పటి నుంచే ఎన్నో ఆసక్తికర అంశాలతో భారతీయ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దశాబ్దాల తర్వాత బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌బచ్చన్‌, కమల్‌హాసన్‌ కలయికకు ఈ చిత్రం వేదిక అవ్వడం ఓ విశేషం. 1985లో వచ్చిన ‘గిరఫ్తార్‌’ చిత్రంలో అమితాబ్‌, కమల్‌ అన్నదమ్ములుగా నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ‘కల్కి’ చిత్రంతో వీరి కాంబినేషన్‌ సెట్టయింది. ఇందులో కమల్‌హాసన్‌ సుప్రీం యాస్కిన్‌ పాత్రను పోషించగా, అమితాబ్‌ అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నారు. వీరి కలయికతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశా పటానీ కథానాయికలు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వనీదత్‌ నిర్మించారు.

Updated Date - Jun 27 , 2024 | 12:25 AM