పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో..

ABN , Publish Date - Mar 19 , 2024 | 03:51 AM

కన్నడ ఇండస్ట్రీలోని ప్రముఖ నటుల్లో ఒకరైన కోమల్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం యమధీర. మాజీ క్రికెటర్‌, కేరళ స్పీడ్‌స్టార్‌ శ్రీశాంత్‌ ఇందులో నెగెటివ్‌ రోల్‌ పోషించారు...

పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో..

కన్నడ ఇండస్ట్రీలోని ప్రముఖ నటుల్లో ఒకరైన కోమల్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం యమధీర. మాజీ క్రికెటర్‌, కేరళ స్పీడ్‌స్టార్‌ శ్రీశాంత్‌ ఇందులో నెగెటివ్‌ రోల్‌ పోషించారు. శంకర్‌ ఆర్‌ దర్శకత్వం వహించారు. వేదాల శ్రీనివాస్‌ నిర్మించారు. నాగబాబు, ఆలీ, సత్యప్రకాశ్‌, మధుసూధన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను ఈ నెల 23న విడుదల చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ‘‘ ‘యమధీర’ టైటిల్‌ చాలా క్యాచీగా ఉంది. కోమల్‌ కుమార్‌ పోలీస్‌ ఆఫీసర్‌పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా అత్యున్నత టెక్నికల్‌ వాల్యూ్‌సతో ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు’’ అని అన్నారు. చిత్ర నిర్మాత వేదాల శ్రీనివాస రావు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాని మంచి సక్సెస్‌ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌ : సి రవిచంద్రన్‌, కెమెరామెన్‌:రోష్‌ మోహన్‌ కార్తీక్‌, సంగీత దర్శకుడు:వరుణ్‌ ఉన్ని.

Updated Date - Mar 19 , 2024 | 03:51 AM