హాలీవుడ్‌ సిరీస్‌లో

ABN , Publish Date - May 15 , 2024 | 12:22 AM

వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందంతో అభిమానుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్నారు టబు. హీరోయిన్‌గానే కాకుండా కథాబలం ఉన్న చిత్రాల్లో సైతం...

హాలీవుడ్‌ సిరీస్‌లో

వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందంతో అభిమానుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్నారు టబు. హీరోయిన్‌గానే కాకుండా కథాబలం ఉన్న చిత్రాల్లో సైతం ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవలే ‘ది క్రూ’ చిత్రంతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆమె మరో అరుదైన అవకాశాన్ని అందుకున్నారు. ప్రముఖ హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌లో టబు చాన్స్‌ దక్కించుకున్నారు. ‘డ్యూన్‌: ప్రాఫెసీ’ సిరీస్‌లో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో సిస్టర్‌ ఫ్రాన్సెస్కా అనే పాత్రలో టబు కనిపించనున్నారు. ఓ హాలీవుడ్‌ మీడియా సంస్థ ఈ విషయాన్ని తెలిపింది. ఈ సిరీస్‌లో టబు పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌కు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Updated Date - May 15 , 2024 | 12:22 AM