గురు శిష్యుల కాంబినేషన్‌లో

ABN , Publish Date - Jan 09 , 2024 | 03:55 AM

సుకుమార్‌ శిష్యుడు యశస్వి వీ దర్శకుడిగా కొత్త చిత్రం ఖరారైంది. సుకుమార్‌ సొంత నిర్మాణ సంస్థ ‘సుకుమార్‌ రైటింగ్స్‌’లో ఈ చిత్రం తెరకెక్కనుంది...

గురు శిష్యుల కాంబినేషన్‌లో

సుకుమార్‌ శిష్యుడు యశస్వి వీ దర్శకుడిగా కొత్త చిత్రం ఖరారైంది. సుకుమార్‌ సొంత నిర్మాణ సంస్థ ‘సుకుమార్‌ రైటింగ్స్‌’లో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీపక్‌ సరోజ్‌ కథానాయకుడిగా యశస్వి దర్శకత్వం వహించిన ‘సిద్ధార్థ్‌రాయ్‌’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆ చిత్రం సుకుమార్‌కు బాగా నచ్చడంతో యశస్వికి తన బేనర్‌లో సినిమా చేసే అవకాశం ఇచ్చారని నిర్మాణ సంస్థ తెలిపింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని యూనిట్‌ పేర్కొంది.

Updated Date - Jan 09 , 2024 | 03:55 AM