నీలి మేఘములలో...
ABN , Publish Date - Aug 29 , 2024 | 04:17 AM
రానా దగ్గుబాటి సమర్పణలో నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘35 చిన్న కథ కాదు’ చిత్రం సెప్టెంబర్ 6న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో...
రానా దగ్గుబాటి సమర్పణలో నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘35 చిన్న కథ కాదు’ చిత్రం సెప్టెంబర్ 6న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. నందకిశోర్ ఈమని దర్శకత్వంలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. లీడ్ పెయిర్ జర్నీని అందంగా ఆవిష్కరిస్తూ భరద్వాజ్ గాలి రాసిన ‘నీలి మేఘములలో’ పాటను బుధవారం విడుదల చేశారు. వివేక్ సాగర్ ఈ గీతానికి స్వరాలు అందించారు.