కశ్మీర్‌ నేపథ్యంలో...

ABN , Publish Date - Jul 19 , 2024 | 02:01 AM

శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమరన్‌’. కమల్‌హాసన్‌ తన సొంత బేనర్‌ రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్‌పై సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌తో కలసి నిర్మిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక...

శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమరన్‌’. కమల్‌హాసన్‌ తన సొంత బేనర్‌ రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్‌పై సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌తో కలసి నిర్మిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31న ‘అమరన్‌’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ బుధవారం ప్రకటించారు. ప్రముఖ జర్నలిస్ట్‌, రచయిత శివ్‌ అరూర్‌ రచించిన ‘ఇండియస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌’ పుస్తకంలోని ‘మేజర్‌ వరదరాజన్‌’ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. కశ్మీర్‌ నేపథ్యంలో యాక్షన్‌ ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సరికొత్త పాత్రలో శివకార్తికేయన్‌ కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సీహెచ్‌ సాయి.

Updated Date - Jul 19 , 2024 | 02:01 AM