పవర్‌ఫుల్‌ అవతార్‌లో...

ABN , Publish Date - May 21 , 2024 | 06:15 AM

మంచు మనోజ్‌ ఎనిమిదేళ్ల విరామం తర్వాత వెండితెరపైకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మిరాయ్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా...

పవర్‌ఫుల్‌ అవతార్‌లో...

మంచు మనోజ్‌ ఎనిమిదేళ్ల విరామం తర్వాత వెండితెరపైకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మిరాయ్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా, టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సోమవారం మంచు మనోజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన పాత్ర గ్లింప్స్‌ను ‘ద బ్లాక్‌ స్వార్డ్‌’ పేరుతో విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో ఆయన చాలా పవర్‌ఫుల్‌ అవతార్‌లో కనిపించారు. ఈ సందర్భంగా మనోజ్‌ మాట్లాడుతూ ‘‘మిరాయ్‌‘ కథ విన్నప్పుడు అద్భుతంగా అనిపించింది. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. ఇంతటి చాలెంజింగ్‌ రోల్‌తో మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో మనోజ్‌ భాగమవ్వటం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన కమ్‌బ్యాక్‌ ఎంతో ఆనందాన్ని ఇస్తోంది’’ అని చెప్పారు. పీరియాడికల్‌ సూపర్‌ హీరో ఫాంటసీగా తెరకెక్కుతున్న ‘మిరాయ్‌’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18న ఎనిమిది భాషల్లో 2డి, 3డి వెర్షన్స్‌లో విడుదలవుతోంది.

Updated Date - May 21 , 2024 | 06:15 AM