మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో

ABN , Publish Date - Jul 15 , 2024 | 02:55 AM

రామ్‌ చరణ్‌ డైరెక్టర్‌ బుచ్చిబాబు సనాతో ‘ఆర్‌సి16’ వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రలో...

రామ్‌ చరణ్‌ డైరెక్టర్‌ బుచ్చిబాబు సనాతో ‘ఆర్‌సి16’ వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో క్రీడా నేపథ్యంలో ఈ సినిమాను వెంకట సతీశ్‌కిలారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంఽధించిన ఓ ఆసక్తికరమైన సంగతిని డైరెక్టర్‌ బుచ్చిబాబు సనా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ ప్రస్తుతం ఫుల్‌ జోష్‌తో సాగుతోంది. దుబాయ్‌లోని ఫిర్‌దౌస్‌ స్టూడియోలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు, సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌, దర్శకుడు బుచ్చిబాబు కలసి దిగిన ఫొటోను యూనిట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

Updated Date - Jul 15 , 2024 | 02:55 AM