మాస్‌ లుక్‌లో...

ABN , Publish Date - Mar 30 , 2024 | 04:42 AM

రజనీకాంత్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కలయిక పట్టాలెక్కింది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘తలైవ ర్‌ 171’ అనేది వర్కింగ్‌ టైటిల్‌...

మాస్‌ లుక్‌లో...

రజనీకాంత్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కలయిక పట్టాలెక్కింది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘తలైవ ర్‌ 171’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన కీలక అప్డేట్‌ను లోకేశ్‌ వెల్లడించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను సోష్‌ల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ఏప్రిల్‌ 22న టైటిల్‌ను ప్రకటించనున్నట్లు తెలిపారు. పోస్టర్‌లో రజనీకాంత్‌ మాస్‌లుక్‌లో కనిపించారు. ఆయన చేతులకు వాచ్‌లతో సంకెళ్లు వేసి ఉండడం ఆసక్తిని కలిగించింది. సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Updated Date - Mar 30 , 2024 | 04:42 AM