Varun Tej : నాలుగు విభిన్న గెటప్‌లలో...

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:07 AM

వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ భారీ సెట్‌ వేశారు. అందులో ఈ నెల 19 నుంచి షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Varun Tej : నాలుగు విభిన్న గెటప్‌లలో...

వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ భారీ సెట్‌ వేశారు. అందులో ఈ నెల 19 నుంచి షూటింగ్‌ ప్రారంభం కానుంది. ‘పలాస’ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు కరుణకుమార్‌ దర్శకత్వంలో రజనీ తాళ్లూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యావత్‌ భారతదేశాన్నీ కదిలించిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ నాలుగు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్‌ చంద్ర, అజయ్‌ ఘోష్‌, కన్నడ కిశోర్‌, రవీంద్ర విజయ్‌, పి.రవిశంకర్‌ ఇతర ముఖ్య పాత్రధారులు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌, సినిమాటోగ్రాఫర్‌: ఎ.కిశోర్‌కుమార్‌.

Updated Date - Jun 08 , 2024 | 05:07 AM