మరో 50 రోజుల్లో... పుష్ప-2

ABN , Publish Date - Oct 18 , 2024 | 12:49 AM

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ పుష్ప. దీని కొనసాగింపుగా వస్తున్న సినిమా పుష్ప-2. మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై...

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ పుష్ప. దీని కొనసాగింపుగా వస్తున్న సినిమా పుష్ప-2. మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్‌. ఈ చిత్రం మరో 50 రోజుల్లో అంటే డిసెంబరు 6న విడుదలకు సిద్ధమవుతోంది. ఆ మేరకు చిత్ర బృందం హింట్‌ ఇస్తూ పోస్టర్‌ని విడుదల చేసింది. పోస్టర్‌లో అల్లు అర్జున్‌ సింహాసనంపై కూర్చొని మాసివ్‌ లుక్‌తో కనిపించారు. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నాతోపాటు ఇతర పాత్రల్లో ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటించారు.

Updated Date - Oct 18 , 2024 | 12:49 AM