మరో 200 రోజుల్లో...

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:45 AM

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ఫ ది రైజ్‌’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం విదితమే. 2021లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ఆ చిత్రం. అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే ఇది అతి పెద్ద విజయం కాగా...

మరో 200 రోజుల్లో...

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ఫ ది రైజ్‌’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం విదితమే. 2021లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ఆ చిత్రం. అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే ఇది అతి పెద్ద విజయం కాగా, ఈ సినిమాతోనే ఆయన జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డ్‌ పొందారు. దీనికి సీక్వెల్‌గా ‘పుష్ప 2 ది రూల్‌’ రూపొందుతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులలో చిత్ర యూనిట్‌ ఇటీవల విడుదల తేదీ ప్రకటించి జోష్‌ పెంచింది. తాజాగా సోమవారం మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ను నిర్మాతలు ఇచ్చారు. మరో రెండు వందల రోజుల్లో ‘పుష్ఫ 2’ వస్తుందంటూ ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, సునీల్‌, అనసూయ తదితరులు నటిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు.

Updated Date - Jan 30 , 2024 | 05:45 AM