యాక్షన్‌ రోల్‌లో...

ABN , Publish Date - May 15 , 2024 | 12:25 AM

కేజీఎఫ్‌’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా రాఖీ భాయ్‌గా పాపులరయిన కన్నడ నటుడు యశ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్‌’. ‘ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’ అనేది ఉపశీర్షిక. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌...

యాక్షన్‌ రోల్‌లో...

కేజీఎఫ్‌’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా రాఖీ భాయ్‌గా పాపులరయిన కన్నడ నటుడు యశ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్‌’. ‘ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’ అనేది ఉపశీర్షిక. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కె. వెంకట్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను రెండు వెర్షన్స్‌లో తెరకెక్కిస్తున్నారు. ఒకటి పాన్‌ ఇండియా వెర్షన్‌ కాగా, ఇంకోటి ఇంటర్నేషనల్‌ వెర్షన్‌. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ కథానాయిక హ్యుమా ఖురేషి మరో కీలక పాత్రను పోషిస్తున్నారని తెలిసింది. ఆమె పోషించే పాత్ర పూర్తి యాక్షన్‌ కోణంలో సాగుతుందని సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు

చేస్తోంది.

Updated Date - May 15 , 2024 | 12:25 AM