డాన్‌కు జోడీగా

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:54 AM

అగ్రహీరోలందరి సరసన హీరోయిన్‌గా నటిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నారు కియారా అద్వాణీ. మరో భారీ చిత్రంలో ఆమె కథానాయికగా అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు...

డాన్‌కు జోడీగా

అగ్రహీరోలందరి సరసన హీరోయిన్‌గా నటిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నారు కియారా అద్వాణీ. మరో భారీ చిత్రంలో ఆమె కథానాయికగా అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. రణ్‌వీర్‌సింగ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘డాన్‌ 3’ చిత్రంలో కియారా కథానాయికగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ ప్రకటించారు. ఈ చిత్రంలో కియారా పాత్ర శక్తిమంతంగా ఉంటుంది, పోరాట ఘట్టాల్లో ఆమె అలరిస్తారు అని మేకర్స్‌ చెప్పారు. కియారా తొలిసారి రణ్‌వీర్‌తో జోడీ కడుతున్నారు. ఆమె ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్‌ తో ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం చేస్తున్నారు.

Updated Date - Feb 21 , 2024 | 03:54 AM