పవర్‌ఫుల్‌ పాత్రలో

ABN, Publish Date - Jul 17 , 2024 | 06:25 AM

పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో కార్తి కథానాయకుడిగా రూపొందుతున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘సర్దార్‌ 2’. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సర్దార్‌’ చిత్రానికి...

పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో కార్తి కథానాయకుడిగా రూపొందుతున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘సర్దార్‌ 2’. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సర్దార్‌’ చిత్రానికి ఇది కొనసాగింపు. కొన్ని రోజుల క్రితమే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమైంది. తాజాగా చిత్రబృందం అప్‌డేట్‌ ఇచ్చింది. నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ రోల్‌లో నటిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. ఎస్‌. లక్ష్మణ్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Jul 17 , 2024 | 06:25 AM