పౌరాణిక నేపథ్యంలో...

ABN , Publish Date - Nov 24 , 2024 | 01:08 AM

నాగచైతన్య తను నటించబోయే కొత్త సినిమాను ప్రకటించారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘ఎన్‌సీ 24’ వర్కింగ్‌ టైటిల్‌తో.. పౌరాణిక నేపథ్యంలో...

నాగచైతన్య తను నటించబోయే కొత్త సినిమాను ప్రకటించారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘ఎన్‌సీ 24’ వర్కింగ్‌ టైటిల్‌తో.. పౌరాణిక నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కార్తీక్‌ దండు దర్శకత్వంలో బివీఎ్‌సఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘తండేల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ బేనర్‌పై బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చే సింది. తుపానులో ఓడపై చేతిలో యాంకర్‌ పట్టుకుని నాగ చైతన్య కనిపించారు.

Updated Date - Nov 24 , 2024 | 01:08 AM