ఆకట్టుకునే ‘సిల్క్‌ శారీ’

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:34 AM

వాసుదేవరావు, రీనా చౌదరి, ప్రీతి గోస్వామి నటిస్తున్న చిత్రం ‘సిల్క్‌ శారీ’. టి.నాగేందర్‌ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కమలేశ్‌ కుమార్‌, రీవా చౌదరి, రాహుల్‌ అగర్వాల్‌...

ఆకట్టుకునే ‘సిల్క్‌ శారీ’

వాసుదేవరావు, రీనా చౌదరి, ప్రీతి గోస్వామి నటిస్తున్న చిత్రం ‘సిల్క్‌ శారీ’. టి.నాగేందర్‌ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కమలేశ్‌ కుమార్‌, రీవా చౌదరి, రాహుల్‌ అగర్వాల్‌, హరీశ్‌ చండక్‌ నిర్మిస్తున్నారు. బుధవారం నిర్మాత రాజ్‌ కందుకూరి ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ సినిమా టైటిల్‌ బాగుంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘సిల్క్‌ శారీ’ కథ గొప్పగా ఉంది’’ అని అన్నారు. హీరో వాసుదేవరావు మాట్లాడుతూ ‘‘ఓ ఆసక్తికరమైన సంఘటన నేపఽథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయగ్రాహకుడు:సనక రాజశేఖర్‌, సంగీతం:వరికుప్పల యాదగిరి.

Updated Date - Apr 18 , 2024 | 06:34 AM