ఆకట్టుకునేలా అరి

ABN , Publish Date - Jan 24 , 2024 | 12:47 AM

వినోద్‌వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్‌, సాయికుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘అరి’. ‘మై నేమ్‌ ఈజ్‌ నో బడీ’ అనేది ఉపశీర్షిక. జయశంకర్‌ దర్శకుడు...

ఆకట్టుకునేలా అరి

వినోద్‌వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్‌, సాయికుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘అరి’. ‘మై నేమ్‌ ఈజ్‌ నో బడీ’ అనేది ఉపశీర్షిక. జయశంకర్‌ దర్శకుడు. శ్రీనివాస్‌రెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మాతలు. ఇందులోని సూర్య పురిమెట్ల పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. సూర్య పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, కథ, కథనం, సంగీతం అన్ని అంశాలూ ఆకట్టుకునేలా ఉంటాయని మేకర్స్‌ చెబుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విడుదల చేయడంలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి, చమ్మక్‌ చంద్ర, శుభలేఖ సుధాకర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కృష్ణప్రసాద్‌, శివశంకరప్రసాద్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

Updated Date - Jan 24 , 2024 | 12:47 AM