అందరినీ ఆకట్టుకుంటుంది

ABN , Publish Date - Jun 07 , 2024 | 04:08 AM

‘గూఢచారి’, ‘మేజర్‌’ చిత్రాలతో దర్శకుడిగా టాలీవుడ్‌లో తనదైన ముద్రవేశారు శశి కిరణ్‌తిక్క. కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘సత్యభామ’...

అందరినీ ఆకట్టుకుంటుంది

‘గూఢచారి’, ‘మేజర్‌’ చిత్రాలతో దర్శకుడిగా టాలీవుడ్‌లో తనదైన ముద్రవేశారు శశి కిరణ్‌తిక్క. కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘సత్యభామ’ సినిమాకు ఆయన స్ర్కీన్‌ప్లే అందించడమే కాకుండా సమర్పకులుగా వ్యవహరించారు. నేడు సినిమా విడుదలవుతున్న సందర్భంగా శశి కిరణ్‌తిక్క మీడియాతో ముచ్చటించారు ‘‘ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. థియేటర్స్‌లో సినిమాను చూసేటప్పుడు ఇందులోని ఎమోషన్స్‌తో ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతారు. దర్శకుడు సుమన్‌ సినిమాను గ్రిప్పింగ్‌గా తీసిన విధానం, కాజల్‌ ఎనర్జిటిక్‌ యాక్టింగ్‌, శ్రీ చరణ్‌ సంగీతం ఈ సినిమాకు పెద్ద హైలైట్స్‌’’ అని చెప్పారు.

Updated Date - Jun 07 , 2024 | 04:08 AM