కంటెంట్‌ ఉన్న చిత్రాలకు ఆదరణ ఉంటుంది

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:08 AM

‘కంటెంట్‌ ఉంటే ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను అందించిన ‘బిచ్చగాడు’ చిత్రంతో అది మరోసారి రుజువైంది. అందుకే ప్రజలకు మనసుకి హత్తుకొనే విధంగా, వాస్తవానికి దగ్గరగా ‘రికార్డ్‌ బ్రేక్‌’...

కంటెంట్‌ ఉన్న చిత్రాలకు ఆదరణ ఉంటుంది

‘కంటెంట్‌ ఉంటే ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను అందించిన ‘బిచ్చగాడు’ చిత్రంతో అది మరోసారి రుజువైంది. అందుకే ప్రజలకు మనసుకి హత్తుకొనే విధంగా, వాస్తవానికి దగ్గరగా ‘రికార్డ్‌ బ్రేక్‌’ చిత్రాన్ని తీశాను. కథ మీద నమ్మకంతో చాలా డబ్బు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు సీనియర్‌ నిర్మాత శ్రీనివాసరావు. ‘హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’ చిత్రం తర్వాత ఆయన మళ్లీ దర్శకత్వం వహించిన ‘రికార్డ్‌ బ్రేక్‌ ’ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ట్రైలర్‌ రిలీజ్‌ అయినప్పుడు ఎటువంటి రెస్పాన్స్‌ వచ్చిందో ఈ సినిమాను అందరికీ చూపించినప్పుడు అదే స్పందన వచ్చింది. ప్రీవ్యూ సమయంలో సినీ ప్రముఖులు ఇచ్చిన సూచనల మేరకు సినిమాను కొంత ట్రిమ్‌ చేశాం. దీని వల్ల సినిమాకు మరింత అందం వచ్చింది. ఈ సినిమాకు ‘రికార్డ్‌ బ్రేక్‌’ టైటిల్‌ యాప్ట్‌ అని అందరూ చెబుతున్నారు’ అని ఆయన అన్నారు. ‘ప్రస్తుతం ఉన్న హీరోలలో ఇటువంటి భారీ కాయం ఉన్న వారెవరూ లేరు. అందుకే కొత్త వారిని ఎన్నుకొని ఈ సినిమా తీశాం. సినిమాకు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టాం. అలాగే విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలోనూ రాజీ పడలేదు’ అని చెప్పారు శ్రీనివాసరావు.

‘హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య ’ చిత్రం కొన్ని కేంద్రాల్లో బాగా ఆడినా , అప్పుడు వచ్చిన పెద్ద సినిమాలతో పోటీ పడలేకపోయింది. ‘రికార్డ్‌ బ్రేక్‌’ చిత్రం మాత్రం కచ్చితంగా అందరినీ అలరిస్తుంది. మంచి సినిమాగా నిలుస్తుంది. ‘బిచ్చగాడు’ చిత్రంలో హీరో తల్లి కోసం కష్టపడతాడు. ‘రికార్డ్‌ బ్రేక్‌’లో బిడ్డల కోసం తల్లి ఏం చేసింది అని చెబుతున్నాం. పతాక సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి’ అని చెప్పారాయన. ‘నాకు ఎక్కువ థియేటర్లు అందుబాటులో ఉన్నా ‘బిచ్చగాడు’ సినిమాలా మొదట కొన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నాం. ప్రేక్షకుల స్పందనను బట్టి థియేటర్ల సంఖ్య పెంచుతాం’ అని చెప్పారు శ్రీనివాసరావు. ‘రికార్డ్‌బ్రేక్‌’ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు తనకు పాస్‌ మార్కులు వేస్తే హాలీవుడ్‌ స్థాయిలో ఓ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో తీస్తానని చదలవాడ శ్రీనివాసరావు ప్రకటించారు.

Updated Date - Mar 06 , 2024 | 01:08 AM