‘మంజుమ్మెల్ బాయ్స్’ నిర్మాతలకు ఇళయరాజా లీగల్ నోటీసులు
ABN , Publish Date - May 24 , 2024 | 03:18 AM
మలయాళ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ నిర్మాతలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. కారణం ‘గుణ’ చిత్రం కోసం ఇళయరాజా స్వరపరిచిన ‘కమ్మని ఈ ప్రేమ లేఖలే’ పాటను ఈ సినిమాలో వాడడమే...

మలయాళ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ నిర్మాతలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. కారణం ‘గుణ’ చిత్రం కోసం ఇళయరాజా స్వరపరిచిన ‘కమ్మని ఈ ప్రేమ లేఖలే’ పాటను ఈ సినిమాలో వాడడమే. అనుమతి తీసుకోకుండా, రాయల్టీ ఫీజు చెల్లించకుండా ఇలా పాటను ఉపయోగించడం కాపీరైట్ చట్టాన్ని అతిక్రమించినట్లేనని ఇళయరాజా లాయర్ శరవణన్ అన్నాదురై నిర్మాతలకు పంపించిన నోటీసులో హెచ్చరించారు. ఈ విషయంపై 15 రోజుల్లో నిర్మాతలు తగిన విధంగా స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని ఆయన తెలిపారు. కాగా, రజనీకాంత్ ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘కూలీ’ సినిమాలోనూ తను సంగీతం అందించిన ‘తంగా మగన్’(1983) చిత్రంలోని ‘వా వా పక్కమ్ వా’ పాటను కూడా అనుమతి లేకుండా వాడారని ఇళయరాజా, నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌కు ఈ నెల 2న నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.