16న ‘ఐఐఎఫ్‌ఐ’ అవార్డ్స్‌ కార్యక్రమం

ABN , Publish Date - Mar 07 , 2024 | 01:34 AM

తెలుగు ఇండస్ట్రీలోని ప్రతిభావంతుల్ని గౌరవించుకునేందుకు తెలుగు ఫిల్మ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఫోరం ఓ అవార్డ్స్‌ ప్రదానోత్సవం ఈ నెల 16న నిర్వహిస్తోంది. ‘ఐకాన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండసీ...

16న ‘ఐఐఎఫ్‌ఐ’ అవార్డ్స్‌ కార్యక్రమం

తెలుగు ఇండస్ట్రీలోని ప్రతిభావంతుల్ని గౌరవించుకునేందుకు తెలుగు ఫిల్మ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఫోరం ఓ అవార్డ్స్‌ ప్రదానోత్సవం ఈ నెల 16న నిర్వహిస్తోంది. ‘ఐకాన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండసీ’్ట్ర (ఐఐఎ్‌ఫఐ) పేరిట జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన కర్టెన్‌ రైజర్‌ బుధవారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగింది. ఇందులో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘‘ఈ అవార్డ్స్‌ కార్యక్రమం వెనుక గొప్ప లక్ష్యం ఉంది. దీని ద్వారా అన్ని క్రాఫ్ట్స్‌లోని సీనియర్లను గౌరవించబోతున్నాం. తెలుగు సినిమా 75 ఏళ్ల కార్యక్రమం మనం ఘనంగా నిర్వహించుకున్నాం. వందేళ్ల పండగకు ఇంకా ఎనిమిదేళ్లు ఉంది. అప్పటి వరకూ ఎంతమంది బతికి ఉంటారో తెలీదు. అందుకే అప్పటి వరకూ ఆగేకంటే ఈ లోగా అన్ని విభాగాల్లోని సీనియర్స్‌ను గౌరవించబోతున్నాం. ఈ ప్రయత్నాన్ని దిగ్విజయం చేసేందుకు ఇండస్ట్రీలోని అందరి సహకారం అవసరం’’ అన్నారు. కార్యక్రమంలో ‘ఐఐఎ్‌ఫఐ’ నిర్వాహకులు నాగబాల సురేశ్‌, స్పాన్సరర్‌ విజయ్‌ కుమార్‌, నటి దివ్యవాణి, జ్యూరీ సభ్యుడు జర్నలిస్ట్‌ ప్రభు కూడా మాట్లాడారు.

Updated Date - Mar 07 , 2024 | 01:34 AM