బాలీవుడ్‌కు ఐఫా అవార్డులు
ABN , Publish Date - Sep 30 , 2024 | 02:15 AM
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల వేడుక మూడో రోజు కూడా కొనసాగింది. మొదట దక్షిణాది చిత్ర ప్రముఖులకు అవార్డులు ఇవ్వగా, చివరి రోజు బాలీవుడ్ ప్రముఖుల్ని అవార్డులతో సత్కరించారు. ‘జవాన్’ చిత్రంలో...
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల వేడుక మూడో రోజు కూడా కొనసాగింది. మొదట దక్షిణాది చిత్ర ప్రముఖులకు అవార్డులు ఇవ్వగా, చివరి రోజు బాలీవుడ్ ప్రముఖుల్ని అవార్డులతో సత్కరించారు. ‘జవాన్’ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన షారుఖ్‌ఖాన్ ఉత్తమ నటుడి అవార్డును దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే ఉత్తమ నటి అవార్డ్‌ను రాణీ ముఖర్జీ, ఉత్తమ దర్శకుడి అవార్డ్‌ను సందీప్ వంగా, ‘టెన్త్ ఫెయిల్’ దర్శకుడు విధు వినోద్ చోప్రా స్వీకరించారు. అలాగే ‘యానిమల్’ సినిమాలో నటించిన బాబీ డియోల్ ఉత్తమ విలన్‌గా అవార్డ్ అందుకున్నారు. సీనియర్ నటి రేఖ, ప్రభుదేవా, షాహిద్ కపూర్, జాన్వీ కపూర్, నోరా ఫతేహి, కృతీ సనన్, అనన్య పాండే ప్రదర్శించిన నృత్యాలు ఆహుతుల్ని అలరించాయి.