గిలాసే ఎత్తేస్తే కులాసే

ABN , Publish Date - Jun 19 , 2024 | 04:15 AM

ప్రియదర్శి, నభా నటేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్‌’. ‘హను-మాన్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా హిట్‌ను అందుకున్న కె. నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అశ్విన్‌ రామ్‌ దర్శకుడు. ఇటీవలే విడుదలైన టైటిల్‌ గ్లింప్స్‌కు...

గిలాసే ఎత్తేస్తే కులాసే

ప్రియదర్శి, నభా నటేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్‌’. ‘హను-మాన్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా హిట్‌ను అందుకున్న కె. నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అశ్విన్‌ రామ్‌ దర్శకుడు. ఇటీవలే విడుదలైన టైటిల్‌ గ్లింప్స్‌కు చక్కటి ఆదరణ దక్కింది. ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ను యూనిట్‌ ప్రారంభించింది. ‘డార్లింగ్‌’ నుంచి తొలి గీతం ‘ఖలాసే ఖాలాసే మామా నా బతుకే ఖలాసే... గిలాసే ఎత్తేస్తే కులాసే’ను మంగళవారం విడుదల చేసింది. సామాన్యుడి బాధలను ఏకరువు పెడుతూ సాగే ఈ గీతానికి కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా, వివేక్‌ సాగర్‌ స్వరాలు సమకూర్చారు. హనుమాన్‌ సీహెచ్‌, రామ్‌ మిరియాల ఆలపించారు. బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్‌, అనన్య నాగళ్ల కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నరేశ్‌ రామదురై, ఎడిటర్‌: ప్రదీప్‌ ఇ రాఘవ్‌,

Updated Date - Jun 19 , 2024 | 04:15 AM