బట్టతలలా కనిపించాలి అంటే సరే అన్నా

ABN , Publish Date - Aug 13 , 2024 | 05:05 AM

‘విజయవాడ రావడం చాలా హ్యాపీగా ఉంది. డైట్‌ను పక్కన పెట్టి ‘బాబాయ్‌ హోటల్‌’ లో ఇడ్లీలు తినేశా. నా ‘అపరిచితుడు’ సినిమా మిగిలిన ప్రాంతాలకంటే విజయవాడలోనే ఎక్కువ రోజులు ఆడింది...

‘విజయవాడ రావడం చాలా హ్యాపీగా ఉంది. డైట్‌ను పక్కన పెట్టి ‘బాబాయ్‌ హోటల్‌’ లో ఇడ్లీలు తినేశా. నా ‘అపరిచితుడు’ సినిమా మిగిలిన ప్రాంతాలకంటే విజయవాడలోనే ఎక్కువ రోజులు ఆడింది మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంత సపోర్ట్‌ చేస్తారో నాకు తెలుసు’ అన్నారు హీరో విక్రమ్‌. ఆయన నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘తంగలాన్‌’ ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ మాళవిక మోహనన్‌, హాలీవుడ్‌ నటుడు డేనియల్‌, నిర్మాత ధనుంజయన్‌తో కలసి ప్రమోషన్స్‌ నిమిత్తం విజయవాడ వెళ్లిన విక్రమ్‌ మాట్లాడుతూ ‘నేను విభిన్న పాత్రలు పోషించిన చిత్రాలన్నీ మీరు ఆదరించారు. ఈ సినిమాలోనూ కొత్తగా కనిపిస్తా. బట్టతలగా కనిపించే గెటప్‌లో కనిపించాలని దర్శకుడు పా.రంజిత్‌ చెప్పగానే సరేనన్నా. ఈ సినిమాలో రెగ్యులర్‌ ఫైట్లు, పాటలు ఉండవు. భావోద్వేగాలు బాగా ఉన్న కథ ఇది. ‘తంగలాన్‌’ మిమ్మల్ని సరికొత్త లోకంలోకి తీసుకెళుతుంది’ అన్నారు.

Updated Date - Aug 13 , 2024 | 05:05 AM