అన్నా అని పిలిస్తే ఫీలయ్యా
ABN , Publish Date - Oct 20 , 2024 | 02:19 AM
అందమైన అమ్మాయిని చూస్తే ఎవరికైనా మాట్లాడాలనిపిస్తుంది. సరదాగా కాసేపు కబుర్లు చెప్పాలనిపించడమూ కామన్. అయితే అప్పుడు ఆ అమ్మాయి ‘అన్నా’ అంటే మాత్రం అబ్బాయిలు తట్టుకోలేరు...
అందమైన అమ్మాయిని చూస్తే ఎవరికైనా మాట్లాడాలనిపిస్తుంది. సరదాగా కాసేపు కబుర్లు చెప్పాలనిపించడమూ కామన్. అయితే అప్పుడు ఆ అమ్మాయి ‘అన్నా’ అంటే మాత్రం అబ్బాయిలు తట్టుకోలేరు. ఈ విషయంలో మన సినిమా హీరోలు కూడా అతీతం కాదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే శివకార్తీకేయన్‌కు ఎదురైందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ‘అమరన్’ ఆడియో వేడుకలో చెప్పారు. ‘‘నేను ఓ టీవీ చానెల్‌లో పనిచేసేటప్పుడు సాయిపల్లవిని మొదటిసారి కలిశాను. అందులో ఓ షో కోసం నేను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నప్పుడు సాయి పల్లవి ఆ కార్యక్రమానికి వచ్చారు. ఇండస్ట్రీలో ఆమె పేరే ఒక బ్రాండ్. ‘ప్రేమమ్’ సినిమాలో ఆమె నటనను చూసి ఫోన్ చేసి ప్రశంసించాను. ఆమె అందుకు ‘థ్యాంక్యూ అన్నా’ అన్నారు. సాయి పల్లవి అలా పిలిచేసరికి ఫీల్ అయ్యా’’ అని చెప్పారు. ఈ విషయాన్ని శివ కార్తీకేయన్ స్టేజీ మీద చెప్తున్ననంత సేపూ సాయి పల్లవి నవ్వుతూనే ఉన్నారు.