మంచి కథ కుదిరితే...

ABN , Publish Date - May 10 , 2024 | 01:23 AM

మోహన్‌ భగత్‌, సుప్రిత సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, రవీంద్ర విజయ్‌ నటించిన చిత్రం ‘ఆరంభం’. అజయ్‌ నాగ్‌ వి దర్శకత్వం వహించగా అభిషేక్‌ వీటీ నిర్మించారు...

మంచి కథ కుదిరితే...

మోహన్‌ భగత్‌, సుప్రిత సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, రవీంద్ర విజయ్‌ నటించిన చిత్రం ‘ఆరంభం’. అజయ్‌ నాగ్‌ వి దర్శకత్వం వహించగా అభిషేక్‌ వీటీ నిర్మించారు. ఈ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ఈ రోజు విడుదలతోన్న సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘ఈ మూవీ టీమ్‌ పనితీరు అద్భుతంగా ఉంది. మంచి కథ కుదిరితే వీరితో కలసి ఓ సినిమా చేస్తా’’ అని అన్నారు. దర్శకుడు అజయ్‌ నాగ్‌ వి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాని అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. నిర్మాత అభిషేక్‌ వీటీ మాట్లాడుతూ ‘‘ఇలాంటి న్యూ కాన్సెప్ట్‌ సినిమాకు అందరి ఆదరణ దక్కాలి’’ అని ఆకాంక్షించారు.

Updated Date - May 10 , 2024 | 01:23 AM