అహంకారం ప్రధాన పాత్ర పోషిస్తే

ABN , Publish Date - May 13 , 2024 | 12:07 AM

రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ నటించిన ఓటీటీ చిత్రం ‘విద్య వాసుల అహం’. మణికాంత్‌ గిల్లి దర్శకత్వం వహించగా, మహేశ్‌ దత్త మొతూరు...

అహంకారం ప్రధాన పాత్ర పోషిస్తే

రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ నటించిన ఓటీటీ చిత్రం ‘విద్య వాసుల అహం’. మణికాంత్‌ గిల్లి దర్శకత్వం వహించగా, మహేశ్‌ దత్త మొతూరు, లక్ష్మీనవ్య మక్కపాటి నిర్మించారు. ఇందులో అవసరాల శ్రీనివాస్‌, తనికెళ్ల భరణి, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 17 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవనుంది. పెళ్లయిన కొత్త జంట మధ్య అహంకారం ప్రధాన పాత్ర పోషిస్తే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయనేది కథ. ఈ చిత్రానికి ఎడిటర్‌: సత్య గిడుతూరి, డీఓపీ: అఖిల్‌ వల్లూరి, సంగీతం: కల్యాణి మాలిక్‌.

Updated Date - May 13 , 2024 | 12:07 AM