చాణక్యుడు, చంద్రగుప్తుడిని కలిపితే చిరంజీవి

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:37 AM

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘‘షరతులు వర్తిస్తాయి’’. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించారు. నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు...

చాణక్యుడు, చంద్రగుప్తుడిని కలిపితే చిరంజీవి

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘‘షరతులు వర్తిస్తాయి’’. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించారు. నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ‘‘షరతులు వర్తిస్తాయి’’ సినిమా ఈ నెల 15న థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. హీరో ప్రియదర్శి ముఖ్య అతిథిగా హైదరాబాద్‌లో మంగళవారం ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ ‘‘మనం ఇవాళ తెరపై చాలా సూపర్‌ హీరో్‌సను చూస్తున్నాం. ఈ సినిమాలో ఓ మిడిల్‌ క్లాస్‌ వారియర్‌ పోరాటాన్ని చూపిస్తున్నారు’’ అని అన్నారు. దర్శక నిర్మాత మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకు రిలీజైన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ చూస్తుంటే ఈ సినిమాను నిజాయితీగా తెరకెక్కించారని తెలుస్తోంది’’ అని చెప్పారు. దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘‘ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడ ఉన్నా వారి జీవితంలో జరిగిన సందర్భాలను ఈ కథతో రిలేట్‌ చేసుకుంటారు’’ అని అన్నారు. హీరో చైతన్య రావు మాట్లాడుతూ ‘‘ ఇది మా అందరి కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. నా క్యారెక్టర్‌కు చిరంజీవి అనే పేరు పెట్టినప్పటి నుంచి భయమూ, భక్తితో నటించాను’’ అని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ ‘‘నన్ను నమ్మే నలుగురు వ్యక్తులు చెప్పిన మాటలను పాటిస్తూ ఈ సినిమాను రూపొందించాను. థియేటర్స్‌కు వెళ్లి సినిమా చూడండి, మీ డబ్బులు, టైమ్‌ వృథా కావు’’ అని అన్నారు. నిర్మాత డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ చాణక్యుడిని, చంద్రగుప్తుడిని కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది’’ అని అన్నారు. హీరోయిన్‌ భూమి శెట్టి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా మన జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది’’ అని చెప్పారు.

Updated Date - Mar 13 , 2024 | 03:37 AM