ఇడియట్‌ ప్రేమకథ

ABN , Publish Date - May 11 , 2024 | 05:29 AM

రవితేజ కుటుంబం నుంచి మరో కథానాయకుడు వస్తున్నాడు. ‘మిస్టర్‌ ఇడియట్‌’ చిత్రంతో రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఇడియట్‌ ప్రేమకథ

రవితేజ కుటుంబం నుంచి మరో కథానాయకుడు వస్తున్నాడు. ‘మిస్టర్‌ ఇడియట్‌’ చిత్రంతో రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. సిమ్రాన్‌ శర్మ కథానాయిక. గౌరీ రోణంకి దర్శకత్వంలో జేజేఆర్‌ రవిచంద్‌ నిర్మిస్తున్నారు. రవితేజ ఈ చిత్రం టీజర్‌ను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ఇద్దరు కళాశాల విద్యార్థుల స్నేహం ప్రేమగా ఎలా మారింది అనేది ఆసక్తికరంగా ఆవిష్కరించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌. సినిమాటోగ్రఫీ: రామ్‌.

Updated Date - May 11 , 2024 | 05:29 AM