ఇక రాజకీయాల జోలికి వెళ్లను

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:08 AM

ఇక నుంచి తాను రాజకీయ ప్రేరేపిత కథాంశాలతో సినిమాలు చేయనని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల చుట్టూ అల్లుకున్న వివాదాస్పద అంశాలతో పలు సినిమాలు...

ఇక రాజకీయాల జోలికి వెళ్లను

ఇక నుంచి తాను రాజకీయ ప్రేరేపిత కథాంశాలతో సినిమాలు చేయనని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల చుట్టూ అల్లుకున్న వివాదాస్పద అంశాలతో పలు సినిమాలు చేస్తూ వార్తల్లో నిలిచారు వర్మ. ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆయన తోక ముడిచినట్లు కనిపిస్తోంది. తన సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాజకీయాలపై సినిమాలు చేయడం మానుకుంటున్నాను. ఇక నుంచి దేవుళ్లపై సినిమాలు చేస్తాను అని చెప్పారు.

Updated Date - Jun 16 , 2024 | 05:08 AM