జాన్వీ ప్రేమ విషయంలో నేను ఇన్‌వాల్వ్‌ అవ్వను

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:54 AM

అజయ్‌ దేవగణ్‌ నటించిన ‘మైదాన్‌’ చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది. బోనీకపూర్‌ నిర్మించారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నప్పటికీ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు...

జాన్వీ ప్రేమ విషయంలో నేను ఇన్‌వాల్వ్‌ అవ్వను

అజయ్‌ దేవగణ్‌ నటించిన ‘మైదాన్‌’ చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది. బోనీకపూర్‌ నిర్మించారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నప్పటికీ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

‘‘నా పిల్లల వ్యక్తిగత విషయాలలో నేను ఇన్‌వాల్వ్‌ అవ్వను. వారికి నచ్చినట్లు ఉండే స్వేచ్చను ఇస్తా. ఈ కాలం పిల్లలను మన తరంలోలా కట్టిపడేయలేం కదా. పిల్లల రిలేషన్స్‌ విషయంలో చాలా రూమర్స్‌ వస్తున్నాయి. ముఖ్యంగా జాన్వీ, శిఖర్‌ పహారియా ప్రేమ వ్యవహారం గురించి. నేను ఆ విషయంలో తలదూర్చలేను. నా కూతురికి సలహా అవసరమైన సమయంలోనే నేను తండ్రిగా కలుగజేసుకుంటాను అని చెప్పారు. అలాగే ఈ సందర్భంగా తన భార్య శ్రీదేవిని గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు బోనీ కపూర్‌. ‘నాతో పోల్చితే శ్రీదేవికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆమె నమ్మకాలు, వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక భావాలు నాపై కూడా ప్రభావం చూపి నన్ను ఆధ్యాత్మికత వైపు నడిపించాయి. శ్రీదేవి చేసే పనులు ఎప్పుడూ ప్రత్యేకంగా, ఆశ్యర్యకరంగా ఉండేవి. తన తల్లిలాగే జాన్వీకపూర్‌కు కూడా భక్తి ఎక్కువే’’ అని చెప్పారు. ఈ మధ్యే జాన్వీకపూర్‌, తన బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్‌పహారియాతో కలిసి తిరుమల దర్శించడం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

Updated Date - Apr 02 , 2024 | 05:54 AM