నేను బతికుండగా అంగీకరించను
ABN , Publish Date - Apr 05 , 2024 | 03:21 AM
అతిలోక సుందరి శ్రీదేవిని ప్రేమించి పెళ్లాడారు బోనీకపూర్. దురదృష్టవశాత్తు శ్రీదేవి 2018లో మరణించారు. పలు సందర్భాల్లో ఆమె జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనవుతుంటారు బోనీకపూర్...

అతిలోక సుందరి శ్రీదేవిని ప్రేమించి పెళ్లాడారు బోనీకపూర్. దురదృష్టవశాత్తు శ్రీదేవి 2018లో మరణించారు. పలు సందర్భాల్లో ఆమె జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనవుతుంటారు బోనీకపూర్. ప్రస్తుతం ‘మైదాన్’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆయనను ఓ ఆంగ్ల మీడియా ప్రతినిధి శ్రీదేవి బయోపిక్ ఉంటుందా అని అడగగా, బోనీకపూర్ సమాధానమిచ్చారు. ‘‘శ్రీదేవి వ్యక్తిగత స్వేచ్చను కోరుకునే వ్యక్తి. బతికున్నంత కాలం ఆమె తన వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాలలో ఎంతో గోప్యతను పాటించింది. భర్తగా నేను ఆమె ఆలోచనల్ని గౌరవించాలి. నేను బతికున్నంత వరకూ ఆమె బయోపిక్‌కు అంగీకరించను’’ అని చెప్పారు.