సమంతతో కలసి నటించాలనుంది

ABN, Publish Date - Oct 09 , 2024 | 01:05 AM

ఆలియా భట్‌, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్‌ బాల దర్శకత్వంలో కరణ్‌జోహార్‌, అపూర్వ మెహతా, ఆలియా భట్‌, సౌమెన్‌ మిశ్రా నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను రాజమౌళి, రామ్‌చరణ్‌ విడుదల చేశారు. ఈ నెల 11న సినిమా...

ఆలియా భట్‌, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్‌ బాల దర్శకత్వంలో కరణ్‌జోహార్‌, అపూర్వ మెహతా, ఆలియా భట్‌, సౌమెన్‌ మిశ్రా నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను రాజమౌళి, రామ్‌చరణ్‌ విడుదల చేశారు. ఈ నెల 11న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించగా..ముఖ్య అతిథులుగా త్రివిక్రమ్‌, రానా దగ్గుబాటి, సమంత విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ ‘‘ఆలియా నటనంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకుల ప్రేమను అలియా ఈ సినిమాతో మరోసారి సంపాదించుకుంటారు’’ అని చెప్పారు. ‘‘ఆన్‌ స్ర్కీన్‌, ఆఫ్‌ స్ర్కీన్‌ సమంత ఓ హీరో. సమంతతో కలసి నటించాలనుంది. నాకు, ఆమెకు సరిపడా స్ర్కిప్ట్‌ను త్రివిక్రమ్‌ రాస్తే బాగుండనిపిస్తోంది. ఇది యాక్షన్‌, డ్రామా, ఎమోషన్‌ ఉన్న ఇంటెన్స్‌ సినిమా’’ అని ఆలియా భట్‌ అన్నారు.


ఇద్దరూ నాకు ఇష్టమైన హీరోయిన్లే!

నాకు ఇష్టమైన ఇద్దరు హీరోయిన్లు అలియాభట్‌, సమంత ఇక్కడే ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్‌ అదిరిపోయింది. ట్రైలర్‌ చూస్తుంటే సినిమా పక్కా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని అనిపిస్తోంది. రజనీకాంత్‌ అన్ని భాషల్లోనూ అభిమానుల్ని సంపాదించుకున్నారని తెలిసిందే. సమంత కూడా అలాగే అన్ని భాషల్లోని అభిమానుల మనసును గెలుచుకున్నారని అనిపిస్తోంది. సమంత ముంబయిలోనే కాకుండా హైదరాబాద్‌కు కూడా అప్పుడప్పుడూ వస్తే బాగుంటుంది. సమంత నటిస్తానంటే.. ఆమె కోసం రాయడానికి సిద్ధం. ‘అత్తారింటికి దారేది’ లాగా.. సమంత హైదరాబాద్‌కు రావాలంటే ‘హైదరాబాద్‌కు దారేది’ అనాలేమో. సమంత మూవీ సెట్స్‌లో ఓ డైనమేట్‌లా ఉంటారు. ఈ కార్యక్రమంలో అలియా కూడా డైనమేట్‌లా కనిపిస్తున్నారు’’ అని చెప్పారు.

Updated Date - Oct 09 , 2024 | 01:05 AM