ఏఐ మ్యూజిక్‌తో ‘ఐ వాంట్ లవ్’
ABN , Publish Date - Sep 24 , 2024 | 02:31 AM
డైరెక్టర్ ఆర్జీవీ బ్యానర్‌పై గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శారీ’. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రవి వర్మ నిర్మిస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరోహీరోయిన్లుగా...
డైరెక్టర్ ఆర్జీవీ బ్యానర్‌పై గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శారీ’. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రవి వర్మ నిర్మిస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలోని మొదటి గీతం ‘ఐ వాంట్ లవ్’ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలోని మొత్తం పాటలను ఏ.ఐను ఉపయోగించే కంపోజ్ చేశాము. నేపథ్య సంగీతానికి కూడా ఏ.ఐతోనే ముందుకు వెళ్తాం. ఇకపై ‘ఆర్జీవీ మ్యూజిక్ డెన్’ నుంచి వచ్చే ప్రతీ పాటలో ఏ.ఐ యాప్స్‌తో తయారు చేసిన సంగీతం మాత్రమే ఉంటుంది’’ అని చెప్పారు.