కాన్సెప్ట్‌ నచ్చి సినిమా తీశా

ABN , Publish Date - Jan 25 , 2024 | 04:45 AM

హన్సిక హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న ‘105 మినిట్స్‌’ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బొమ్మకు శివ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘సినిమాలంటే నాకు ప్యాషన్‌...

కాన్సెప్ట్‌ నచ్చి సినిమా తీశా

హన్సిక హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న ‘105 మినిట్స్‌’ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బొమ్మకు శివ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘సినిమాలంటే నాకు ప్యాషన్‌. ఎప్పటినుంచో సినిమా తీయాలనే కోరిక ఉంది. అది ఈ సినిమాతో తీరింది. దర్శకుడు రాజు ఏడాది నుంచి నాతో ట్రావెల్‌ అవుతున్నాడు. అతను ఈ కథ గురించి చెప్పగానే అదే సినిమా తీయాలనుకున్నాను’ అన్నారు. మొదట హీరోయిన్‌గా వేరొకరిని అనుకున్నామనీ, అయితే ఈ కథ హన్సికకు సూట్‌ అవుతుందని ఆమెను ఎప్రోచ్‌ అయ్యామనీ, తను కూడా పాజిటివ్‌గా రియాక్ట్‌ అయ్యారని నిర్మాత శివ చెప్పారు. ‘సింగిల్‌ ఆర్టిస్ట్‌, సింగిల్‌ టేక్‌ అనే కాన్సెప్ట్‌ చాలా కొత్తగా అనిపించింది. నార్మల్‌గా షూట్‌కి 20 రోజులు పడితే, దాన్ని ప్రాక్టీసు చేసుకుని చిత్రీకరించడానికి 45 రోజులు పట్టింది. సినిమా మొత్తం ఒకే పాత్ర కనిపిస్తుంది. కానీ ఇంకో వాయిస్‌ వినిపిస్తుంది. ఆ వాయిస్‌ కూడా ఓ పాన్‌ ఇండియా నటుడిది, ఈ సినిమాకు రూ 3 కోట్లు బడ్జెట్‌ అనుకున్నాం. కానీ మూడున్నర కోట్లు అయింది’ అని తెలిపారు శివ.

Updated Date - Jan 25 , 2024 | 04:45 AM