సస్పెన్షన్‌ తొలగిస్తారని ఆశిస్తున్నా

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:20 AM

బెంగుళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ అరెస్టయిన సంగతి తెలిసిందే. దీంతో ‘మా’ అసోసియేషన్‌ నుంచి ఆమెను సస్పెండ్‌ చేశారు. తాజాగా, నటి హేమ ఓ లేఖ రాసి, ‘మా’ అసోసియేషన్‌...

బెంగుళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ అరెస్టయిన సంగతి తెలిసిందే. దీంతో ‘మా’ అసోసియేషన్‌ నుంచి ఆమెను సస్పెండ్‌ చేశారు. తాజాగా, నటి హేమ ఓ లేఖ రాసి, ‘మా’ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణుకు అందజేశారు. అందులో ‘‘నేను దశాబ్ద కాలం పైగా ‘మా’లో సభ్యురాలిగా ఉన్నాను. ‘మా’ నాకు అమ్మలాంటిది. డ్రగ్స్‌ కేసులో నాపై అనేక ఆరోపణలు రావడంతో నా అంతట నేనే డ్రగ్స్‌ శాంపిల్‌ టెస్ట్‌ చేయించుకున్నాను. అందులో నాకు నెగెటివ్‌ వచ్చింది. త్వరలోనే పోలీసులు చేసిన టెస్ట్‌లోనూ ఇదే ఫలితం వస్తుందనే నమ్మకం ఉంది. డ్రగ్స్‌ కేసులో నాపై జరిగిన దుష్ప్రచారంతో నేను ఎంతో మానసిక క్షోభకు లోనయ్యాను. నా విషయంలో ‘మా’ సభ్యులు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. నాపై సస్పెన్షన్‌ తొలగిస్తారని ఆశిస్తున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు. అలాగే, త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ను తీసుకొని తనకు న్యాయం చేయాలని హేమ కోరనున్నారు.

Updated Date - Jul 09 , 2024 | 02:20 AM