షరతులు పెట్టకుండా ఈ సినిమా చూడాలి: ఎంఎం కీరవాణి

ABN , Publish Date - Feb 19 , 2024 | 05:21 PM

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న సినిమా 'షరతులు వర్తిస్తాయి' కి తన సహకారాన్ని అందించారు. ఈ సినిమాలో ఒక పాటను విడుదల చేశారు, ఈ చిత్ర టీముకు సినిమా బాగా ఆడాలని తన విషెస్ ని అందచేశారు

షరతులు పెట్టకుండా ఈ సినిమా చూడాలి: ఎంఎం కీరవాణి
Popular music director MM Keeravani releases a song from film Sharatulu Vartistaayi

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన 'ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి' సినిమాకి కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వహించారు. నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మాతలు. ఈ సినిమా నుంచి 'కాలం సూపుల గాలంరా..' అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ, 'ష‌ర‌తులు వ‌ర్తిసాయి' సినిమా టీముకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. చైతన్య హీరోగా కుమారస్వామి దర్శకత్వం వహించిన 'ష‌ర‌తులు వ‌ర్తిసాయి' సినిమాను షరతులు పెట్టకుండా ప్రేక్షకులు చూసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా అని కీరవాణి అన్నారు.

mmkeeravanisharathulu.jpg

కథానాయకుడు చైతన్య రావ్ మాట్లాడుతూ, కీరవాణి గారు తన సినిమాలోని 'కాలం సూపుల గాలంరా..' అనే పాటను విడుదల చేసినందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాం అని చెప్పారు. ఆయనకు మా టీమ్ తరుపున కూడా కృతజ్ఞతలు అని చెపుతూ, ఈ పాటకు గోరేటి వెంకన్న గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. రామ్ మిర్యాల అంతే గొప్పగా పాడారు. అరుణ్ ఇచ్చిన సంగీతం ప్రేక్షకులకు బాగా దగ్గరవుతుంది అని చెప్పారు.

దర్శకుడు కుమారస్వామి తనకి ఒత్తిడి ప్రపంచంలో రిలీఫ్ ఇచ్చేది సంగీతమే అని చెప్పారు. తను రోజూ వినే పది పాటల్లో నాలుగు కీరవాణి గారి పాటలే ఉంటాయి అని చెపుతూ, ఆయన విలువైన సమయాన్ని కేటాయించి 'ష‌ర‌తులు వ‌ర్తిసాయి' సినిమాలోని పాట విడుదల చేసినందుకు కీరవాణి గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నా అని చెప్పారు.

Updated Date - Feb 20 , 2024 | 12:32 AM