ఇంత అద్భుతంగా నటించానా అనిపించింది

ABN , Publish Date - Feb 13 , 2024 | 06:13 AM

‘ఈగల్‌’ చిత్రానికి ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కాళికాదేవి ఎపిసోడ్‌ చూస్తుంటే నేనేనా ఇంత అద్భుతంగా నటించింది అనిపించింది’ అని రవితేజ అన్నారు. ఆయన కథానాయకుడిగా...

ఇంత అద్భుతంగా నటించానా అనిపించింది

‘ఈగల్‌’ చిత్రానికి ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కాళికాదేవి ఎపిసోడ్‌ చూస్తుంటే నేనేనా ఇంత అద్భుతంగా నటించింది అనిపించింది’ అని రవితేజ అన్నారు. ఆయన కథానాయకుడిగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ‘ఈగల్‌’ చిత్రం సక్సె్‌సమీట్‌ ఇటీవలే జరిగింది. ఈ సందర్భంగా కార్తీక్‌ మాట్లాడుతూ ‘నాకు అవకాశం ఇచ్చిన రవితేజ గారికి ధన్యవాదాలు. ఆయన వల్లే ఇంత గొప్ప విజయం సాధ్యమైంది’ అని చెప్పారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘రవితేజతో ‘ధమాకా’ తర్వాత ‘ఈగల్‌’తో మరో బ్లాక్‌బస్టర్‌ కొట్టాం. కార్తిక్‌తో మరిన్ని సినిమాలు చేయబోతున్నాం’ అని తెలిపారు.

పెగ్‌ కలిపారా?స్టఫ్‌ ఇచ్చారా?

తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా డిజిటల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై దర్శకుడు హరీష్‌ శంకర్‌ ‘ఈగల్‌’ సక్సె్‌సమీట్‌లో ఘాటుగా స్పందించారు. ‘నేను నిర్మాత ఇంట్లో పడి రేయింబవళ్లు తాగుతున్నానంటూ, నా షాడో ఫొటో పెట్టి ఓ వెబ్‌సైట్‌లో వార్తలు రాస్తున్నారు. నేను తాగుతుంటే మీరొచ్చి పెగ్‌ కలిపారా? స్టఫ్‌ ఇచ్చారా? మీకు నిజంగా దమ్ము ఉంటే నా ఫొటో పెట్టి ఆ వార్త రాయండి. అప్పుడు నా ప్రతిస్పందన చూద్దురు. ‘ఇకపైనా ఇలానే చేస్తాం’ అంటే చేసుకోండి. నా వెంట్రుక కూడా పీకలేరు’ అని అన్నారు.

‘నాకు గ్యాప్‌ వచ్చిందంటున్నారు, ఇప్పుడు ఒకేసారి ఐదు సినిమాలు చేస్తున్నా. ఇవన్నీ మీకు చెప్పి చేయాలా?, మా నాన్నలాగా స్కూల్‌ ఫీజు కట్టావా? నీకు చూపించడానికి’ అని ప్రశ్నించారు. రివ్యూల్లో విమర్శ కనిపిస్తే సరే గానీ అది హేళన స్థాయికి వెళ్లడం చూస్తుంటే బాధేస్తోందన్నారు. సినీ జర్నలిస్టులు కూడా ఇండస్ట్రీలో భాగమే, కానీ మన లో మనం కలహించుకోవడం వల్ల బయటివారికి లోకువవుతున్నామని గుర్తెరగాలి అని హరీష్‌ శంకర్‌ హితవు పలికారు.

Updated Date - Feb 13 , 2024 | 06:13 AM