విడాకుల విషయం నాకు తెలియదు
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:47 AM
తనకు తెలియకుండా, తన సమ్మతి లేకుండా తన భర్త విడాకుల ప్రకటన చేశారంటూ ఆర్తి రవి బుధవారం ప్రకటన విడుదల చేయడంతో తమిళ హీరో జయం రవి విడాకుల వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది...
తనకు తెలియకుండా, తన సమ్మతి లేకుండా తన భర్త విడాకుల ప్రకటన చేశారంటూ ఆర్తి రవి బుధవారం ప్రకటన విడుదల చేయడంతో తమిళ హీరో జయం రవి విడాకుల వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. ఈ విషయంపై ఆమె విడుదల చేసిన ప్రకటనలో.. ‘మా వైవాహిక జీవితం గురించి మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు చూసి ఆందోళనకు గురయ్యాను. 18 ఏళ్ళుగా పరస్పర విశ్వాసం, గౌరవంతో కుటుంబ జీవితాన్ని గడుపుతున్నాం. ఈ విడాకుల ప్రకటన వల్ల మా గౌరవ మర్యాదలతో పాటు వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్టుగా భావిస్తున్నాను. నా భర్తతో మాట్లాడాలని, కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. కానీ, నాకు అలాంటి అవకాశం దక్కలేదు. నేను, నా పిల్లలు ఇబ్బంది పడుతున్నాం. వైవాహిక బంధం నుంచి వైదొలగాలనే ఈ నిర్ణయం పూర్తిగా ఆయన సొంతంగా తీసుకున్నది. దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించదలచుకోలేదు. అయితే, నా వ్యక్తిత్వానికి కళంకం కలిగించేలా బహిరంగంగా జరుగుతున్న ప్రచార దాడులను సహించలేకపోతున్నాను. ఈ అసత్య ప్రచారాన్ని తిరస్కరించడం నా తొలి కర్తవ్యం’ అని ఆర్తి రవి పేర్కొన్నారు.
చెన్నై(ఆంధ్రజ్యోతి)