నాకేం ఆ ఉబలాటం లేదు

ABN , Publish Date - Sep 23 , 2024 | 06:16 AM

‘స్టార్‌ హీరోల సరసన నటించేందుకు సిమ్రాన్‌ వెంపర్లాడుతున్నారంటూ కొందరు డిజిటల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నన్ను సంప్రదించకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నవాళ్లంతా నాకు క్షమాపణలు...

‘స్టార్‌ హీరోల సరసన నటించేందుకు సిమ్రాన్‌ వెంపర్లాడుతున్నారంటూ కొందరు డిజిటల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నన్ను సంప్రదించకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నవాళ్లంతా నాకు క్షమాపణలు చెప్పాలి’ అని నటి సిమ్రాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె స్వీయ నిర్మాణంలో విజయ్‌తో భారీ బడ్జెట్‌ సినిమా చేసేందుకు ప్రయత్నించగా ఆయన అంగీకరించలేదంటూ కోలీవుడ్‌ మీడియాలో విస్త్రృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై సిమ్రాన్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పరోక్షంగా స్పందించారు. ‘నేను ఇప్పటికే దక్షిణాదిలో అగ్రహీరోలందరితో సినిమాలు చేశాను. ఇంకా పెద్ద హీరోలతో హీరోయిన్‌గా చేయాలనే ఉబలాటం నాకు లేదు. నా పరిమితులు నాకు తెలుసు. కానీ తరచూ ఎవరితో ఒకరితో ముడిపెడుతూ వార్తలు రాస్తున్నారు. పదే పదే జరుగుతున్న ప్రచారంతో స్నేహితులు, సన్నిహితులు అదంతా నిజమేనని నమ్మే పరిస్థితి వచ్చింది. అందుకే దీనిపై నేను వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇక నుంచైనా ఇలాంటి ప్రచారాన్ని ఆపండి’ అని సిమ్రాన్‌ కోరారు.

Updated Date - Sep 23 , 2024 | 06:16 AM