నాకంత సీన్‌ లేదు

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:39 AM

కథానాయికగా, గాయనిగా, రచయిత్రిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటున్నారు శ్రుతి హాసన్‌. ఫాదర్స్‌ డే సందర్భంగా తన తండ్రి కమల్‌ హాసన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు శ్రుతి. ‘‘నా జీవితంలో మొదటి గురువు...

నాకంత సీన్‌ లేదు

కథానాయికగా, గాయనిగా, రచయిత్రిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటున్నారు శ్రుతి హాసన్‌. ఫాదర్స్‌ డే సందర్భంగా తన తండ్రి కమల్‌ హాసన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు శ్రుతి. ‘‘నా జీవితంలో మొదటి గురువు.. ఆదర్శం మీరే నాన్నా. విభిన్న రంగాల్లో రాణించొచ్చనే స్ఫూర్తినిచ్చింది మీరే. నటిగా మీ అడుగుజాడలను ఎలా ఫాలో అయ్యానో.. ఓ దర్శకురాలిగానూ మిమ్మల్నే అనుసరిస్తా. నిజానికి నాకు దర్శకత్వం అంటే అసక్తి మిమ్మల్ని సెట్‌లో డైరెక్టర్‌గా చూసినప్పుడే ఏర్పడింది’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘‘మీ తండ్రి బయోపిక్‌ మీరు చేసే అవకాశం ఉందా’’ అని అడిగిన ప్రశ్నకు ‘‘కచ్చితంగా కాదు. నేను ఆ పనికి సరైన వ్యక్తిని అనుకోవడం లేదు. నిజం చెప్పాలంటే నాకంత సీన్‌ లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో నాకంటే అద్భుతమైన ప్రతిభ ఉన్నవారు.. అర్హత ఉన్నవారు చాలా మందే ఉన్నారు’’ అని శ్రుతి బదులిచ్చారు.

Updated Date - Jun 18 , 2024 | 03:39 AM