తొలిసారి ఇటువంటి పాత్ర చేశా

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:46 AM

టాలీవుడ్‌ చందమామగా పేరు తెచ్చుకున్న స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సత్యభామ’. నవీన్‌చంద్ర కీలక పాత్ర పోషించగా, సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు...

తొలిసారి ఇటువంటి పాత్ర చేశా

టాలీవుడ్‌ చందమామగా పేరు తెచ్చుకున్న స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సత్యభామ’. నవీన్‌చంద్ర కీలక పాత్ర పోషించగా, సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. రేపు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా కాజల్‌, చిత్ర నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి మీడియాతో ముచ్చటించారు ‘‘దర్శకుడు సుమన్‌ చిక్కాల ఈ సినిమా కథ చెప్పిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చేశా. ఒక పోలీసాఫీసర్‌ ఎమోషనల్‌ జర్నీ ఇది. నేను ఇప్పటివరకూ ఎన్నో పాత్రలు చేశాను.. కానీ ఇటువంటి ఎమోషనల్‌ యాక్షన్‌ రోల్‌లో నటించడం ఫస్ట్‌ టైమ్‌.


ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్‌ అన్నీ సహజంగా ఉంటాయి. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీస్‌ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రైలర్‌లో చూసిన దాని కంటే ఎన్నో ట్విస్ట్‌లు సినిమాలో ఉంటాయి. శ్రీచరణ్‌ పాకాల ఈ సినిమాకు అద్భుతమైన సంగీతంతో పాటూ అదిరిపోయే నేపధ్య సంగీతం ఇచ్చారు’’ అని చెప్పారు. చిత్ర నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీలో మా తొలి ప్రయత్నంలోని ఇటువంటి పవర్‌ఫుల్‌ సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మంచి కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మా ఉద్దేశం. సుమన్‌ చిక్కాలకు ఇది తొలి సినిమా అయినా ఎక్కడా తడబడలేదు. ఒక అరవై ఏళ్ల క్రితం ఇంగ్లాండ్‌లో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కాజల్‌ పెర్ఫార్మెన్స్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె నటన సినిమాకే హైలెట్‌ అవుతుంది’’ అని చెప్పారు.

Updated Date - Jun 06 , 2024 | 03:46 AM