మీ అభిమానాన్ని మర్చిపోలేను

ABN , Publish Date - Nov 29 , 2024 | 06:15 AM

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా సినిమా ‘పుష్ప 2’. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 5న విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పట్నా.. చెన్నైలో ఈవెంట్స్‌...

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా సినిమా ‘పుష్ప 2’. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 5న విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పట్నా.. చెన్నైలో ఈవెంట్స్‌ నిర్వహించింది చిత్ర బృందం. తాజాగా, కేరళలో జరిగిన ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘థ్యాంక్యూ కేరళ. మీ దత్త పుత్రుడు మల్లు అర్జున్‌కు మీరిచ్చిన ఈ ఘనస్వాగతాన్ని జీవితాంతం మరిచిపోలేను. 20 సంవత్సరాలుగా మీరు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. ఈ సినిమా నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం. ఫహాద్‌ ఫాజిల్‌తో నటించినందుకు ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం మీరు మూడేళ్లుగా వెయిట్‌ చేస్తున్నందుకు కృతజ్ఞతలు. తప్పకుండా ఇక నుంచి తొందరగా సినిమాలు చేస్తాను. సుకుమార్‌ తీసిన ‘ఆర్య’ చిత్రంతోనే నాకు కేరళలో గుర్తింపు దక్కింది. ఆయన వల్లే నేను మీకు దగ్గరయ్యాను. సినిమాలో మలయాళ లిరిక్స్‌తో ఓ సాంగ్‌ను చేశాం’’ అని చెప్పారు.


‘‘నాకు కుదిరితే కొచ్చి వచ్చి మీ అందరితో కలిసి సినిమా చూస్తాను. కేరళతో నా అనుబంధం ప్రత్యేకమైనది’’ అని రష్మిక మందన్నా అన్నారు. ‘‘మీ అందరి ఆదరాభిమానాలు చూస్తుంటే ఇది మాకు కేరళలా లేదు. హైదరాబాద్‌లో ఉన్నట్లు ఉంది. ‘పుష్ప 2’ అందరి అంచనాలకు మించి ఉంటుంది’’ అని నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ అన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 06:15 AM