నేను ఆ రెండో కేటగిరికి చెందిన దాన్ని

ABN , Publish Date - Jan 04 , 2024 | 05:55 AM

కెరీర్‌పై చక్కని క్లారిటీ ఉన్న నటి శ్రద్ధా శ్రీనాథ్‌. నాని ‘జర్సీ’తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధ త్వరలో వెంకటేశ్‌ ‘సైంధవ్‌’తో ప్రేక్షకులను పలకరించనుంది...

నేను ఆ రెండో కేటగిరికి చెందిన దాన్ని

కెరీర్‌పై చక్కని క్లారిటీ ఉన్న నటి శ్రద్ధా శ్రీనాథ్‌. నాని ‘జర్సీ’తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధ త్వరలో వెంకటేశ్‌ ‘సైంధవ్‌’తో ప్రేక్షకులను పలకరించనుంది. ఇటీవల ఓ ఇంటర్‌వ్యూలో హీరోయిన్స్‌ కెరీర్‌ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది శ్రధ్ధ. ‘కెరీర్‌ విషయంలో సెలక్టీవ్‌గా ఉండటం కరెక్ట్‌ కాదనేది చాలామంది హీరోయిన్ల అభిప్రాయం. అందుకే వచ్చిన ఏ అవకాశాన్నీ వదులకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తుంటారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం సెలక్టీవ్‌గా నచ్చిన పాత్రలనే ఎంచుకొని చేస్తుంటారు. నేను ఆ రెండో కేటగిరికి చెందిన దాన్ని. మనసుకు నచ్చకపోతే చేయను. అలా ఎంచుకొని చేసిన సినిమానే ‘జర్సీ’. అందులో సరా పాత్ర నా కెరీర్‌కి పెద్ద బ్రేక్‌. రాబోతున్న ‘సైంధవ్‌’ కూడా మంచి పేరు తెస్తుందని నమ్మకంతో ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చారు శ్రద్ధ శ్రీనాథ్‌

Updated Date - Jan 04 , 2024 | 05:55 AM