అలా కామెంట్‌ చేసినందుకు చింతిస్తున్నా

ABN , Publish Date - Aug 24 , 2024 | 06:50 AM

హీరో నాని నటించిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రభా్‌సపై అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘ఆ వ్యాఖ్యల వల్ల అర్షద్‌కు ఎప్పుడూ రానంత ఫేమ్‌ వచ్చింది’’ అని అన్నారు.

హీరో నాని నటించిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రభా్‌సపై అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘ఆ వ్యాఖ్యల వల్ల అర్షద్‌కు ఎప్పుడూ రానంత ఫేమ్‌ వచ్చింది’’ అని అన్నారు. అయితే ఇప్పుడా మాటలు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్కయ్యాయి. ఆ మాటల వల్ల సోషల్‌మీడియాలో అభిమానులు నాని వర్సెస్‌ అర్షద్‌ అంటూ రెండు వర్గాలుగా చీలిపోయారు. తాజాగా, ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్‌ కోసం ముంబై వెళ్లిన నాని.. తాను అర్షద్‌పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘‘అర్షద్‌ చాలా గొప్ప నటుడు. ఆయన గురించి అలా మాట్లాడినందుకు బాధపడుతున్నాను. నటులుగా ఉన్నప్పుడు మాట్లాడే ప్రతీ మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అవి వైరల్‌ అయ్యి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభా్‌సపై అర్షద్‌ చేసిన వ్యాఖ్యల్లో.. అర్షద్‌పై నేను చేసిన వ్యాఖ్యల్లో ఆ పొరపాటే జరిగింది. నిజానికి నేను అర్షద్‌ని అలా అనాలనుకోలేదు. నా మాటలు సోషల్‌మీడియా ద్వారా అలా తప్పుదోవ పట్టాయి. నేను ఆయనపై అలా మాట్లాడినందుకు వచ్చిన రియాక్షన్స్‌ను చూసి అర్షద్‌ పూర్తిఇంటర్వ్యూ చూశాను. అందులో ఆయన మాట్లాడిన మాటలు తప్పుదోవ పట్టాయని అర్థమైంది. అదే విధంగా నా వ్యాఖ్యలు కూడా మరో రకంగా ప్రజల్లోకి వెళ్లాయి’’ అని పేర్కొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 06:50 AM