నిర్మాతగా గర్వపడుతున్నాను
ABN , Publish Date - Feb 07 , 2024 | 06:05 AM
హీరోయిన్‌గా తిరుగులేని స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ కథానాయిక అలియాభట్. ఓ వైపు సినిమాలతో తీరిక లేకుండా ఉన్నా నిర్మాతగానూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు...
హీరోయిన్‌గా తిరుగులేని స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ కథానాయిక అలియాభట్. ఓ వైపు సినిమాలతో తీరిక లేకుండా ఉన్నా నిర్మాతగానూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తన అభిరుచి మేరకు వినూత్న కథలతో సినిమాలు, సిరీ్‌సలు నిర్మిస్తున్నారు. ఆమె సహ నిర్మాతగా మారి నిర్మించిన వెబ్‌సిరీస్ ‘పోచర్’ ఈ నెల 23న ప్రముఖ ఓటీటీలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా అలియాభట్ మాట్లాడుతూ ‘ఈ పుడమిపై జీవించే సమస్త జీవరాశిపై మానవులు దయ చూపించాలనే సందేశాన్ని ‘పోచర్’ సిరీస్ అందిస్తుంది. వన్యప్రాణుల పట్ల మృగాల్లా వ్యవహరించే శక్తుల గురించి ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంది. ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌లో నిర్మాతగా భాగమైనందుకు గర్వంగా ఉంది. దర్శకుడు రిచీ ఈ సిరీ్‌సను ఎంతో శ్రమకోర్చి అద్భుతంగా తెరకెక్కించారు’ అని చెప్పారు. ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేసే ముఠాల నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో నిమేషా సజయన్, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలు పోషించారు.