నేను దేవతను కాను

ABN , Publish Date - Jan 02 , 2024 | 05:10 AM

ఏ ఉద్వేగాన్నీ దాచుకోలేని మనస్తత్వం సమంతది. బాఽధైనా, సంతోషమైనా వ్యక్తపరచకుండా ఉండలేదు తను. రీసెంట్‌ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్నే తీసుకోండి. విదేశాల్లో విహరిస్తూ...

నేను దేవతను కాను

ఏ ఉద్వేగాన్నీ దాచుకోలేని మనస్తత్వం సమంతది. బాఽధైనా, సంతోషమైనా వ్యక్తపరచకుండా ఉండలేదు తను. రీసెంట్‌ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్నే తీసుకోండి. విదేశాల్లో విహరిస్తూ.. తన ఆనందాన్ని ఓ ఇమేజ్‌ ద్వారా వ్యక్తం చేస్తూ.. తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది సమంత. ఆ స్టిల్‌ చూసిన వారంతా ‘దేవత’ అంటూ సమంతను కొనియాడుతున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘నేను దేవతను కాను. ఉద్వేగాలతో అనునిత్యం సహవాసం చేసే మనిషిని. ఓర్పులో భూమికి సమానమైన స్ర్తీని’ అంటూ ఓ మంచి పోస్ట్‌ని జత చేసింది. ఈ పోస్ట్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలకు కామా పెట్టి విహారయాత్రల్లో బిజీగా ఉన్నారు సమంత. త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా కెమెరా ముందుకు వస్తారని ఆమె అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Updated Date - Jan 02 , 2024 | 05:10 AM